Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు వాసి పాడేరు ఏఎస్పీ మృతి ప్రమాదమా? ఆత్మహత్యనా?

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (13:00 IST)
విశాఖపట్టణం జిల్లా పాడేరు ఏఎస్పీ శివకుమార్ మృత్యువాతపడ్డారు. ఆయన వద్ద ఉండే రివాల్వర్ పేలడంతో తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. అయితే, ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందా? లేదా ఆయనకే కాల్చుకుని ప్రాణాలు విడిచాడా అనే సందేహం ఉత్పన్నమైంది. 
 
తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లాకు చెందిన శివకుమార్.. ఐపీఎస్‌కు ఎంపీకై కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఏఎస్పీగా విధుల్లో చేరారు. అక్కడి నుంచి జనవరిలో పాడేరు ఏఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి అని సహచరులు చెపుతుంటారు. అవివాహితుడైన శివకుమార్.. ఆళ్లగడ్డలో పనిచేసినప్పుడు ఎర్రచందనం ముఠాలపై ఉక్కుపాదం మోపాడు. అలాగే, పాడేరులోనూ మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టి సత్ఫలితాలు సాధించారు. అలాంటి అధికారి ఇపుడు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya 46: వెంకీ అట్లూరితో సూర్య సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments