Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్: కాంగ్రెస్‌ను వీడుతారా? పార్టీ మారుతారా?

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (21:18 IST)
కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి స్వంత పార్టీ నేతలపై మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన నేతలు కొందరు సీం కావాలని కలలు కన్నారని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో కలలను పక్కనబెట్టి బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారని చెప్పారు. పీసీసీ చీఫ్ పొన్నాల స్వంత సెగ్మెంట్‌లో నుంచే చాలా మంది నేతలు పార్టీని వీడి వెళ్లారని అన్నారు. 
 
నల్లగొండ జిల్లాలో చాలా అసెంబ్లీ, ఎంపీ నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వం మందకోడిగా సాగుతోందని గుత్తా పేర్కొన్నారు. కాగా, పార్టీలో నేతలు ఐక్యంగా లేరనే వార్తలను సీఎల్పీ నేత జానారెడ్డి ఖండించారు. ఇకపై తామంతా ఒకే వేదికపైకి వచ్చి సమావేశాలు నిర్వహించుకుంటామని జానారెడ్డి ప్రకటించారు. 
 
గుత్తా వ్యాఖ్యలను బట్టి ఆయన త్వరలో పార్టీ మారే అవకాశం లేకపోలేదని వార్తలు వస్తున్నాయి. గుత్తా కాంగ్రెస్‌లో ఐకమత్యం లేదని తద్వారా పార్టీ బలోపేతంపై శ్రమించాల్సిందేనని పరోక్షంగా చెబుతున్నారని, కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం సన్నగిల్లుతోందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. 

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments