Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే ధైర్యం ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది: జగ్గారెడ్డి

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (20:31 IST)
ఏపీ కాంగ్రెస్ ఆంధ్రారత్న భవన్‌లో నూతన లీగల్ సెల్ అధ్యక్షుడు వి.గురునాథం ప్రమాణస్వీకర కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు.
 
లీగల్ సెల్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వి.రంగనాథం గారికి శుభాకాంక్షలు తెలిపారు జగ్గారెడ్డి. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మనసులు కలిసే ఉన్నాయన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇచ్చే ధైర్యం కాంగ్రెస్ పార్టీకే ఉంది. రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సోనియా, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ఇస్తారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కార్యకర్త ధైర్యంగా మాట ఇచ్చాము, హోదా ఇచ్చామని చెప్పుకుంటూ తిరుగుతారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అనంతరం ఏపీలో కూడా అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే వెంకయ్య నాయుడు గారు 10 సంవత్సరాలు అన్నారు. కానీ ఈ రోజు బీజేపీ ప్రత్యేక హోదానే ఇచ్చేది లేదని చెప్పేసింది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments