Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి నిరాకరించిన మేనకోడలు.. హత్యకు సినీ ఫక్కీలో ఛేజింగ్.. తర్వాత ఏమైంది?

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (16:20 IST)
తనను పెళ్లి చేసుకునేందుకు మేనకోడలు నిరాకరించింది. పైగా, మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. దీన్ని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి మేనకోడలిని అడ్డంగా నరికివేయాలని ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్‌లో భాగంగా, సినీ ఫక్కీలో భర్తతో కలిసి ప్రయాణిస్తున్న ఆమె కారును ఛేజించారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఆమె 100కు ఫోన్ చేసి సమాచారం చేయడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన ఒంగోలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా కర్లపాలెంకు చెందిన అట్ట మౌనిక అనే యువతికి ప్రకాశం జిల్లా పాత చీరాలకు చెందిన బక్కా శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి సొంత మేనమామ. దీంతో ఆయన మౌనికపై మనసుపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం పెద్దల ద్వారా మౌనిక దృష్టికి తీసుకెళ్లగా ఆమె నిరాకరించింది. అదేసమయంలో కర్లపాలెంకు చెందిన సదనం తిరుపతిరెడ్డి అనే యువకుడితో పెళ్లి చేసేందుకు మౌనిక తల్లిదండ్రులు నిర్ణయించి, శుక్రవారం తిరుపతిలో జరిపించారు. 
 
తనను కాదని, తిరుపతి రెడ్డిని మౌనిక పెళ్ళి చేసుకోవడం జీర్ణించుకోలోని శ్రీనివాస రెడ్డి... ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. తన ప్లాన్‌లో భాగంగా, తన స్నేహితుల సాయం తీసుకున్నాడు. అలాగే, వివాహం తర్వాత మౌనిక దంపతులు, ఆమె కుటుంబ సభ్యులు మూడు కార్లలో సొంతూరుకు బయలుదేరారు. కారు డ్రైవర్లలో ఒకరిని లోబరుచుకుని ఇన్ఫార్మర్‌గా మార్చుకున్నాడు. ఆ డ్రైవర్ సమాచారాన్ని ఎప్పటికపుడు చేరవేస్తూ వచ్చాడు. ఆ ప్రకారంగా మౌనిక దంపతులు ప్రయాణిస్తున్న కారు నంబరును తెలుసుకున్నాడు. 
 
ఈ నూతన దంపతులు కారు ఒంగోలు సమీపంలోని కొప్పోలు వంతెన వద్దకు రాగానే... శ్రీనివాసరెడ్డి తన కారును అడ్డుగా నిలిపాడు. దీంతో అప్రమత్తమైన మౌనిక.. 100 నంబరుకు డైల్ చేసి పోలీసులకు సమాచారం చేరవేసింది. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని నవదంపతులకు ఎలాంటి హానీ కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి శ్రీనివాస రెడ్డితో పాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేయగా, వారి నుంచి మద్యం బాటిళ్లు, కత్తి, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments