ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా.. గుంటూరులో లాక్డౌన్

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (11:27 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. నేటి నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలులో ఉండనుంది. కోవిడ్‌ కేసులు అధికంగా రావడంతో లాక్‌డౌన్ ప్రకటించినట్లు తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. 
 
లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. వారం రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా.. ఏపీలో బుధవారం 1184 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అవగా.. నలుగురు మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: యముడిలా కనుమరుగు చేసే సమవర్తి పాత్రలో సత్యదేవ్

Payal Rajput: శౌరవ్ ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన పాయిల్ రాజ్ పుత్

ఏవండీ నాకు కేన్సర్ అని డాక్టర్ చెప్పారు: భార్య మాటకు కుప్పకూలిన Family man నటుడు షరీబ్ హష్మి

Purushah Review: భార్యాభర్తల కష్టాలను వినోదాత్మకంగా చెప్పిన పురుషః చిత్రం రివ్యూ-

తర్వాతి కథనం
Show comments