అసలే కరోనా కాలం.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సర్. మాస్క్ వేసుకోండి.. జాగ్రత్తగా ఉండండి అని సహ ఉద్యోగి చెప్పినందుకు ఉన్నతాధికారికి కోపమొచ్చింది. విచక్షణారహితంగా ఆ ఉద్యోగిని చితకబాదాడు. ఆసుపత్రి పాలు జేశాడు.
ఎపి టూరిజంలో నెల్లూరుజిల్లా డిప్యూటీ టూరిజం మేనేజర్ భాస్కర్, సహ ఉద్యోగి ఉషారాణిని ఈ నెల 27వ తేదీన చితకబాదాడు. ఆఫీస్‌కు వచ్చిన భాస్కర్‌ను... సర్ మాస్క్ వేసుకోండని ఉషారాణి చెప్పింది. కాంట్రాక్ట్ పని చేసే నువ్వు కూడా నాకు సలహాలిస్తావా అంటూ భాస్కర్ ఊగిపోతూ ఆమెపై చేయి చేసుకున్నాడు.
తన టేబుల్ పైన ఉన్న ఇనుప కడ్డీతో ఆమె తలపై బాదాడు. జుట్టు పట్టుకుని కిందకు తోశాడు. ఆమె అరుస్తున్నా పట్టించుకోకుండా దారుణంగా కొట్టాడు. ఉషారాణి దివ్యాంగురాలు. అయినా పట్టించుకోలేదు.
సహచర ఉద్యోగులు భాస్కర్‌ను పట్టుకుని పక్కకు నెడుతున్నా వినిపించుకోలేదు. ఆమెను చావబాదాడు. అయితే విషయం బయటకు రానివ్వకుండా మూడురోజుల పాటు జాగ్రత్తపడ్డాడు. అయితే ఈరోజు ఉదయం సి.సి. కెమెరా ఫుటేజ్‌ను పోలీసులకు ఇచ్చింది బాధితురాలు. న్యాయం కావాలని కోరుతోంది.