Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింఛన్ అడిగిన పాపానికి ముదుసలి చెంప వాచింది!

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (10:41 IST)
పింఛన్ అడిగిన పాపానికి ఓ ముదుసలి చెంప వాచిన ఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. ఆమె ఓ పండు ముదుసలి. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్‌తో నిశ్చింతగా జీవించొచ్చని భావించింది. 
 
అయితే ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు లేదు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయిస్తే, పింఛన్ అందకపోతుందా, అనుకున్న ఆమెకు ఊహించని విధంగా చెంపదెబ్బ తగిలింది. 
 
వివరాల్లోకెళితే... పట్టణంలోని 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు లక్ష్మి, పింఛన్ ఇప్పించాలని తమ వార్డు కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత నర్సింలును వేడుకుంది. ముసలమ్మకు సాయం చేయాల్సిన నర్సింలు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. 
 
వృద్ధురాలి చెంప చెళ్లుమనిపించాడు. దీంతో ఆసరా కోసమొస్తే, చెంపదెబ్బ తగిలిందని రోదించిన లక్ష్మి పోలీస్ స్టేషన్లో నర్సింలుపై ఫిర్యాదు చేసింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments