Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా... యాపిల్ ధరను మించిన టమోటా, కిలో ఎంతో తెలిస్తే షాకే..?

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (14:13 IST)
ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన మదనపల్లె టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు కనివినీ ఎరుగని రీతిలో మొదటిరకం టమోటా కిలో 150 రూపాయలు పలకడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. గత రెండు నెలలుగా కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చిన టమోటా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా వారం రోజులుగా అనూహ్యంగా పుంజుకుంది.

 
అయితే నిన్న ఏకంగా 2 కేజీల క్రేటు 3,600 రూపాయలు పలికింది. గత సంవత్సర కాలంగా అప్పులు చేసి పంట పెట్టినప్పటికీ చాలా నష్టపోయామని ఇప్పుడు ఈ ధరల వల్ల తమ అప్పులు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధరలు పతనమైనప్పుడు తమను ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఎవరూ పట్టించుకోలేదని పెరిగినప్పుడు ఆగమేఘాల మీద ధరలను నియంత్రించడానికి ప్రయత్నిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 
ముఖ్యంగా వర్షాలకు అందరి పంట దెబ్బతిని పావు వంతు మాత్రమే పంట వస్తుండడం ధరలు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. యాపిల్ ధర 120 కాగా టమోటా ధర 150 రూపాయలు ఉండటం సామాన్యులను నివ్వెరపరుస్తోంది. 500 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తున్న చోట 100 మెట్రిక్ టన్నులే వస్తోందని అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments