Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం టికెట్లు లేని భక్తులను అలిపిరి వ‌ద్దే ఆపేస్తారు!

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (17:55 IST)
అక్టోబ‌రు 11న‌ గ‌రుడ సేవ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి శ్రీ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు సమర్పించునట్లు  తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి వెంకటప అప్పల నాయుడు తెలిపారు. తిరుప‌తి, తిరుమ‌ల‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నందున మ‌రింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటించే సమయంలో కార్యక్రమం జరుగు చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో స్వల్పంగా ట్రాఫిక్ మళ్ళింపు కూడా ఉంటుందని ఎప్పీ చెప్పారు.  గమనించి ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా ప్రయత్నామ మార్గాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. 
 
అలిపిరి, ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నం, శ్రీ‌వారి ఆల‌యం,  బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, బూంది పోటు, తిరుమ‌ల‌లోని ప్రధాన కూడలిలో అద‌న‌పు పోలీస్ సిబ్బందిని, శీఘ్ర ప్రతి స్పందన బృందాలు (క్విక్ రెస్పాన్స్ టీంలు), రెస్కూటీంలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఎస్ఎస్‌డి, రూ.300- ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం టికెట్లు క‌లిగిన భ‌క్తుల‌ను మాత్రమే అలిపిరి వ‌ద్ద అనుమ‌తించేలా చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు. ద‌ర్శనం టోకెన్లు లేదా టికెట్లు లేని భ‌క్తుల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో తిరుమ‌ల‌కు అనుమ‌తిలేద‌ని, ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి, పోలీస్ సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని జిల్లా యస్.పి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments