Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదల ఆరోగ్య ప్రదాయిని ఎన్టీఆర్ వైద్య సేవ....

రాష్ట్రంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య వైద్య సదుపాయం అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఎన్టీఆర్ వైద్య సేవ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే బృహత్తర కార్యక్రమమే ఎన్టీఆర్ వైద్య స

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (20:14 IST)
రాష్ట్రంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య వైద్య సదుపాయం అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఎన్టీఆర్ వైద్య సేవ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే బృహత్తర కార్యక్రమమే ఎన్టీఆర్ వైద్య సేవ. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టును ఏర్పాటు చేసి... ప్రజలకు కార్పోరేట్ వైద్య సేవలను ఉచితంగా అందిస్తోంది. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవను 421 ఆసుపత్రులు... ఈ పథకం కింద వైద్య సర్వీసులను అందిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇన్ పేషంట్లు, అవుట్ పేషంట్లు మొత్తం 66 లక్షల మంది రోగులకు వైద్య సేవ పథకం ద్వారా చికిత్స  చేశారు.(నవంబర్ 1 నాటికి).
  
పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది. ముఖ్యంగా నిరుపేదలకు ఈ పథకం సంజీవినీగా మారుతోంది. ఎలాంటి ఖర్చు లేకుండా... అన్ని విధాలుగా ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ గుర్తింపు కార్డులతో వైద్యం అందిస్తోంది. జూన్ 2, 2014 నుంచి ఈ పథకం కింద చికిత్స అందిస్తున్నారు. ఇంతకు మునుపు ఉన్న 944 చికిత్సలకు అదనముగా 100 చికిత్సలను చేర్చి, మొత్తము 1044 చికిత్సలకు అనుమతి పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచితముగా వైద్య సేవలను అందిస్తున్నారు. 
 
అంతేకాకుండా సంవత్సరానికి ఒక కుటుంబానికి ప్రభుత్వం వారు ఇంతకు మునుపు ఇస్తున్న ఉచిత వైద్య సహాయాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు.  వినికిడి లోపము ఉన్న చిన్నపిల్లలకు చేయు కాక్లియార్  ఇంప్లాంటేషన్ కు రూ. 6 లక్షల వరకు మరియు మూత్ర పిండ మార్పిడి లాంటి క్లిష్టతరమైన ఆపరేషన్లకు రూ. 3.5 లక్షల వరకు ఈ పథకం కింద లబ్దిపొందవచ్చు.  గుండె , ఊపిరి తిత్తులు మరియు గుండె - ఊపిరి తిత్తులు మార్పిడి చికిత్స కూడా ఈ పథకంలో చేర్చారు. దీని ద్వారా నిరుపేదలకు ఇలాంటి జబ్బులు వచ్చినప్పుడు అప్పులబారిన పడకుండా ప్రభుత్వం వారికి వైద్య సహకారాన్ని అందిస్తోంది.
 
ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద 02-06-2014 నుండి ముందుగా అనుమతి తీసుకొని వైద్యం చేయించుకున్నవారు 8,64,517. వారి చికిత్స కోసం అయిన మొత్తం రూ. 2528.079 కోట్లు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేసిన మొత్తం ఆపరేషన్లు 8,54,000. ఆపరేషన్ల కోసం ఖర్చయిన మొత్తం రూ. 2499.749 కోట్లు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చెల్లింపుల కోసం వచ్చిన క్లెయిమ్ లు 7,50,579 గా ఉన్నాయి. క్లెయిమ్‌ల కోసం చెల్లించిన మొత్తం రూ. 1964.6 కోట్లుగా ఉంది.
 
ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి 133 వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులకే కేటాయించడమైనది. 133 వైద్య సేవలు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన 911 (1044-133=911)  వైద్య సేవల సంఖ్య 2,10,645 గా ఉంది,  ఈ వైద్య సేవలకు వెచ్చించిన ఖర్చు రూ. 548.635 కోట్లకు చేరుకొంది.  ఇక 133 వైద్య సేవలకు సంబంధించి ముందుగా అనుమతి తీసుకున్నవారి సంఖ్య 33,775గా ఉన్నాయి, ఈ సేవల కోసం వెచ్చించిన మొత్తం రూ. 94.236 కోట్ల మేర చెల్లించారు. 133 వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య 83గా ఉంది.
 
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద నిరుపేదల తమ జీవన సౌధాన్ని పునర్నిర్మించుకుంటున్నారు. లక్షల రూపాయలు వైద్యం కింద చెల్లించడం తమ వల్లే అయ్యేది కాదని... రాష్ట్ర ప్రభుత్వం తమకు ఈవిధంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవతో తమ జీవితాలకు భరోసా వచ్చిందని వారు భావిస్తున్నారు.

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments