Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపుల‌ను బీసీల‌లో చేర్చొద్ద‌ని ధ‌ర్నా...

విజ‌య‌వాడ‌ : కాపుల‌ను బీసీల‌లో చేర్చ‌వ‌ద్ద‌ని బీసీ సంఘాల ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి డిమాండు చేసింది. తాము కాపుల‌ను బీసీల‌లో చేర్చ‌డాన్ని పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నామ‌ని బీసీ జేఏసీ మంజునాధన్ క‌మిష‌న్‌కు వివ‌రించింది. బీసీ సంఘాల జేఏసీ నాయ‌కులు మంగ‌ళ‌వారం

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (16:50 IST)
విజ‌య‌వాడ‌ : కాపుల‌ను బీసీల‌లో చేర్చ‌వ‌ద్ద‌ని బీసీ సంఘాల ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి డిమాండు చేసింది. తాము కాపుల‌ను బీసీల‌లో చేర్చ‌డాన్ని పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నామ‌ని బీసీ జేఏసీ మంజునాధన్ క‌మిష‌న్‌కు వివ‌రించింది. బీసీ సంఘాల జేఏసీ నాయ‌కులు మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో మంజునాధ‌న్ క‌మిష‌న్‌ని క‌లిశారు. కాపు, తెల‌గ‌, బ‌లిజ‌, ఒంట‌రి కుల‌స్తుల‌ను బీసీ జాబితాలో చేర్చ‌డాన్ని తాము వ్య‌తిరేకిస్తున్నామ‌న్నారు. ఈ మేర‌కు బీసీ జేఏసీ ప్ర‌తినిధులు మంజునాధన్ క‌మిష‌న్‌ను క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అందించారు. 
 
ప‌ంచ వృత్తుల‌తో ప్ర‌భుత్వ‌ ఆద‌ర‌ణ క‌ర‌వైన విశ్వబ్రాహ్మ‌ణుల‌ను బీసీ బి జాబితా నుంచి ఏ జాబితాకు మార్చాల‌ని రాష్ట్ర విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం డిమాండ్ చేసింది. బీసీల‌కు ఇప్ప‌టికే ఎటువంటి అవ‌కాశాలు లేకుండా పోయాయ‌ని, ఇపుడు కొత్త‌గా కాపుల‌ను బీసీలో చేరిస్తే, ఎవ‌రికీ ఉప‌యోగం లేకుండా పోతుంద‌ని పేర్కొన్నారు. 
 
కాపు రిజ‌ర్వేష‌న్‌ని వ్య‌తిరేకిస్తూ, విజ‌య‌వాడ‌లోని బీసీ క‌మిష‌న్ కార్యాల‌యంలో యాద‌వ సంఘం అధ్యక్షుడు లాకా వెంగ‌ళ‌రావు యాద‌వ్, విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు బంగారు వెంక‌టేశ్వ‌ర్లు, రాష్ట్ర యువ‌జ‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తోలేటి శ్రీకాంత్, లీగ‌ల్ అడ్వ‌యిజ‌ర్ ల‌క్కోజు రామ‌స్వామి, డి.వి.డి. సుబ్ర‌హ్మ‌ణ్యం, అట్లూరి ప‌ర‌బ్ర‌హ్మం త‌దిత‌రులు ధ‌ర్నా చేశారు. విశ్వ‌బ్రాహ్మ‌ణులు అయిదు కుల‌వృత్తుల్లో స‌రైన ఉపాధి, ఆర్ధిక స‌హాయం లేక దారిద్ర్ర్యాన్ని అనుభ‌విస్తున్నార‌ని, 80 ఏళ్ళ క్రితం నిర్ణ‌యించిన బీ కేట‌గిరీని ఇప్ప‌టికీ అమ‌లు చేయ‌డం త‌గ‌ద‌ని బంగారు వెంక‌టేశ్వ‌ర్లు క‌మిష‌న్ కు వివ‌రించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments