Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు అమ్మే హ‌క్కు ఏ ప్ర‌భుత్వానికీ లేదు: మేధా పాట్క‌ర్

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (10:55 IST)
విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని పర్యావరణ ఉద్యమకారిణి  మేధా పాట్కర్ అన్నారు. శనివారం స్ట్రీల్ ప్లాంటు ప్రవేటీకరణ వ్యతిరేకంగా కూర్శన్నపాలెం దగ్గర కార్మికులు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పర్యావరణ ఉద్యమకారిణి మేధాపాట్కర్, ఐఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అపర్ణ సంఘీభావం పలికారు. 
 
 
ఈ సందర్భంగా మేధాపాట్కర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వరంగ సంస్థల ప్రవేటీకరణతో దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశాన్ని ప్రజలే నిర్మించుకున్నారని, ఇందులో నేత‌లు, పార్టీల ప్ర‌మేయం లేద‌ని చెప్పారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో  పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రజలు, కార్మికులు, రైతులు ఉద్యమం చేసే సమయం ఆసన్నమైందని మేధాపాట్కర్ తెలిపారు. 
 
 
ఎట్టి ప‌రిస్థితుల్లో విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మ‌నీయ కూడ‌ద‌ని, మోదీ స‌ర్కారుకు ఈ విశాఖ స్టీల్స్ సాక్షిగా బుద్ధి చెప్పాల‌ని సూచించారు. కార్మికుల ఉద్యామానికి తాము పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లు పర్యావరణ ఉద్యమకారిణి మేధాపాట్కర్, ఐఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అపర్ణ తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments