Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త అసెంబ్లీ వద్ద సౌకర్యాల కొరత.. తాగేందుకే కాదు.. టాయ్‌లెట్‌లో కూడా నీరు లేదట..

కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఎంతో ఆర్భాటంగా ప్రభుత్వం వెలగపూడిలో రాజధాని నిర్మాణం చేపడుతోంది. ముందుగా తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి చేసి సమావేశాలను నిర్వహిస్తోంది. కానీ అందులో ఉన్న సౌకర్యాలు చూస్తే భ

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (14:21 IST)
కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఎంతో ఆర్భాటంగా ప్రభుత్వం వెలగపూడిలో రాజధాని నిర్మాణం చేపడుతోంది. ముందుగా తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి చేసి సమావేశాలను నిర్వహిస్తోంది. కానీ అందులో ఉన్న సౌకర్యాలు చూస్తే భయపడితారట. ఎమ్మెల్యేలు ఆ సౌకర్యాలను చూసి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారట. 
 
ఏపీ తాత్కాలిక అసెంబ్లీలో క‌నీస వ‌స‌తులు లేవట.. క‌నీసం తాగ‌డానికి మంచినీళ్లు కూడా దొర‌క‌డం లేదట.. రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసి ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించిన సచివాలయం, శాసనసభ ప్రాంగణాలలో సరైన వసతులు లేవని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ముఖ్యంగా మంచినీరు కానీ.. వాడ‌కం నీరు కానీ లేక‌పోవ‌డంతో చాలా ఇబ్బంది ప‌డుతున్నారు. స్వ‌యంగా ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మంచి నీళ్లు కావాల‌ని అడిగినా.. ఇచ్చేవారు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం. 
 
ఎంతో గొప్పులు చెప్పుకున్న అసెంబ్లీలో సౌక‌ర్యాల లేమీ స‌ర్కార్‌ను వెక్కిరిస్తుంది. ఈ విష‌యాల‌పై వైసీపీ ఎమ్మెల్యేలు మండిప‌డుతున్నారు. ఎంతో గొప్పగా భవనాలను నిర్మించామని చంద్ర‌బాబు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని.. కానీ ఇక్క‌డ క‌నీస సౌక‌ర్యాలు లేవ‌ని చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి అన్నారు. మంచినీటి కోసం ఎంత ప్రయత్నించినా దొరకడం లేదని వాపోయారు. కనీసం బయట నుంచి తాగునీరు తెచ్చుకోవడానికి అనుమతించడం లేదని, లోపల సభలో కూడా ఇవ్వడం లేదన్నారు. అంతేనా ఇక టాయిలెట్లలో నీరు లేక పరిస్థితి అధ్వాన్నంగా మారిందని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేశామ‌ని చెప్పుకుంటున్న మైకులు కూడా స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేదన్నారు. 
 
ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల మాట్లాడుతున్న‌ప్పుడే వినిపించ‌లేద‌ని.. రూ.వెయ్యి కోట్లు ఖ‌ర్చు చేసి.. అరొక‌ర వ‌స‌తులు క‌ల్పించ‌డ‌మేంట‌ని ఫైర‌వుతున్నారు. హ‌డావుడిగా అసెంబ్లీని అమ‌రావ‌తికి త‌ర‌లించిన ఏపీ స‌ర్కార్‌.. ఏర్పాట్లు పూర్తి కాక‌ముందే.. అక్క‌డికి వెళ్లిపోయింది. తొలి స‌మావేశాలు గ్రాండ్‌గా ప్రారంభిద్దామ‌నుకుంటే.. సౌక‌ర్యాల లేమీ ఎమ్మెల్యేల‌ను ఇబ్బంది పెడుతోంది. అధికార పార్టీ నేత‌ల‌కు ఇలాంటి ఇబ్బందులే ఉన్నా.. బ‌య‌టికి చెప్ప‌లేక‌పోతున్నార‌ట‌.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments