Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పాఠశాలల్లో విద్యార్థుల ప్రార్థనలు రద్దు

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇకపై పాఠశాలల్లో ఉదయం పూట ప్రార్థనలు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, స్కూల్స్‌లలో క్రీడా పోటీలు కూడా నిర్వహించవద్దని కోరింది. 
 
ముఖ్యంగా, విద్యార్థులను తరగతి గదుల్లో భౌతికదూరం పాటించేలా కూర్చోబెట్టాలని, పాఠశాల ప్రాంగణంలో ఎక్కడా కూడా గుమికూడకుండా చూడాలని ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని కోరింది. 
 
అలాగే పాఠశాల గదులను, ఆవరణను ఎప్పటికపుడు శానిటైజ్ చేయాలని ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుండాలని కోరింది. అదేసమయంలో విద్యార్థులు ఎవరైనా కరోనా వైరస్ బారినపడితే తక్షణం చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments