Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సరిహద్దు చెక్‌పాయింట్లు తొలగించడం లేదు: కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (09:08 IST)
రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పాయింట్లను రేపటి నుంచి తొలగిస్తున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమని రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ కృష్ణబాబు స్పష్టం చేశారు. 
 
ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సరిహద్దుల వద్ద చెక్‌ పోస్టులను తొలగించే నిర్ణయమేదీ ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. కొవిడ్‌ ఆర్డర్‌ 55 ప్రకారం చెక్‌పోస్టులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో మరికొంత కాలం ప్రవేశాలను నియంత్రిస్తామన్నారు.

ఎవరైనా రాష్ట్రంలోకి రావాలంటే స్పందన యాప్‌లో వివరాలను నమోదు చేసుకోవాల్సిందేనని చెప్పారు. అలాగే వచ్చే వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

ఎక్కువ కరోనా కేసులున్న 6 రాష్ట్రాల నుంచి వచ్చేవారు 7 రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణకు బస్సులు నడపడానికి ఆ రాష్ట్రం ఇంకా అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.

అక్కడి నుంచి అనుమతి లభిస్తే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని కృష్ణబాబు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments