Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెలివరీ కోసం రెండో భార్యను ఆసుపత్రికి... బిడ్డతో ఇంటికొచ్చేసరికి మూడో భార్యతో కులుకుతూ...

భార్య చనిపోయిందని మరో యువతిని పెళ్ళాడాడు. రెండవ భార్య గర్భవతి కావడంతో ఆసుపత్రిలో చేర్పించాడు. వారం రోజుల వ్యవధిలోనే గుట్టుగా మరో యువతిని పెళ్లాడి కాపురం పెట్టాడు. పురిటి బిడ్డతో భర్త ఇంటికి వచ్చిన ఇల్లాలు భర్త మరో పెళ్ళి చేసుకున్నాడని తెలిసి ఆశ్చర్యా

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (12:32 IST)
భార్య చనిపోయిందని మరో యువతిని పెళ్ళాడాడు. రెండవ భార్య గర్భవతి కావడంతో ఆసుపత్రిలో చేర్పించాడు. వారం రోజుల వ్యవధిలోనే గుట్టుగా మరో యువతిని పెళ్లాడి కాపురం పెట్టాడు. పురిటి బిడ్డతో భర్త ఇంటికి వచ్చిన ఇల్లాలు భర్త మరో పెళ్ళి చేసుకున్నాడని తెలిసి ఆశ్చర్యానికి గురైంది. దిక్కుతోచక మొగుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
చిత్తూరు జిల్లా నాగలాపురం సమీపంలోకి గోళ్ళవారికండ్రికి చెందిన మునికుమార్‌ 2013 సంవత్సరంలో గీతను వివాహం చేసుకున్నాడు. ఆమె మరణించడంతో మేనకను వివాహమాడాడు. మేనకతో వివాహమైన తరువాత ఒక బిడ్డ జన్మించింది. ఆ తరువాత తిరిగి మేనక గర్భవతిగా ఉండడంతో వారం రోజుల క్రితమే తిరుపతిలోని ప్రసూతి ఆసుపత్రిలో డెలివరి కోసం చేర్పించాడు మునికుమార్. భార్యను ఆసుపత్రికి పంపించిన మునికుమార్‌ ఆ గ్యాప్‌లో వనజ అనే యువతిని పెళ్ళాడాడు. 
 
ఆ తరువాత విషయం చెప్పకుండా డెలివరి అయిన మేనకను ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి వచ్చిన తరువాత రెండవ భార్యకు జరిగిందంతా చెప్పుకొచ్చాడు. గుట్టుచప్పుడు కాకుండా సంసారం చేసుకోమని, అనవసరంగా రాద్దాంతం చేస్తే నీతో పాటు నీ ఇద్దరు పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడు. దీంతో మేనక నాగలాపురం పోలీసులను ఆశ్రయించింది. నిత్యపెళ్ళికొడుకుపై చర్యలు తీసుకోవాలని పోలీస్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు బంధువులు. విషయం తెలుసుకున్న మునికుమార్‌ మూడవ భార్యతో ఉడాయించాడు. ప్రస్తుతం నిత్యపెళ్లికొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం