నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారు: సజ్జల

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (10:36 IST)
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పరిధి దాటి ప్రవర్తించడంతోనే తాము తిరిగి ప్రశ్ని్స్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అలా ప్రశ్నించడం రమేశ్‌కుమార్‌కు నచ్చడం లేదని.. లేని అధికారాలను వినియోగించి తమను తప్పించాలని చూస్తున్నారని ఆక్షేపించారు.

నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. తాను ప్రభుత్వ సలహాదారు కాకముందు వైకాపా ప్రధాన కార్యదర్శినని.. పార్టీ అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శిగా గత పదేళ్ల నుంచి ఉన్నానని చెప్పారు. ప్రభుత్వ సలహాదారుగా ఉంటే రాజకీయాలు మాట్లాడకూడదనే అంశం ఎక్కడ నుంచి వచ్చిందో తనకు అర్థం కావడం లేదన్నారు. 
 
ఎస్‌ఈసీ తన పరిధి దాటి అధికారులను ఆదేశిస్తున్నారని.. ఆయన శైలి అభ్యంతరకరం, ఆక్షేపణీయమని చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు ఏజెంట్‌గా నిమ్మగడ్డ వ్యవహరించారని సజ్జల ఆరోపించారు. 2018లో జరగాల్సిన ఎన్నికలను 2020 వరకు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు.

ఎన్నికలను తామెప్పుడూ వ్యతిరేకించలేదని.. వాటికి సదా సిద్ధమని చెప్పారు. తానెక్కడ కూర్చొని మాట్లాడాలో నిర్దేశించి హక్కు ఎస్‌ఈసీకి లేదన్నారు. నిమ్మగడ్డ ఎస్‌ఈసీ స్థానంలో కూర్చొని రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments