Webdunia - Bharat's app for daily news and videos

Install App

18వ తేదీ రాత్రి నుంచి ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (13:55 IST)
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇటీవలికాలంలో ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం పలు కఠిన ఆంక్షలు విధించి అమలు చేస్తుంది. ఇందులోభాగంగా, ఈ నెల 18వ తేదీ అర్థరాత్రి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకిరానుంది. వాస్తవానికి ఈ కర్ఫ్యూను ఇదివరకే అమలు చేయాలని నిర్ణయించింది. అయితే, సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ అమలును వాయిదావేసింది. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 4,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 30,022 మంది వద్ద శాంపిల్స్ సేకరించి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 4,570 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,124 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే, విశాఖలో 1,028, గంటూరులో 368, అనంతపురంలో 347 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో ఈ వైరస్ నుంచి 669 మంది కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఓ కరోనా రోగి ప్రాణాలు కోల్పోయారు. 
 
స్కూల్ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్...  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ బ్యాడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువైపోతోంది. దీంతో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో అన్ని విద్యా సంస్థలకు ఈ నెలాఖరు వరకు సెలవులు ప్రకటించారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
 
ఇదే అంశంపై మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి స్కూల్స్ తెరుచుకుంటాయని చెప్పారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు స్కూల్స్ సెలవులు పొడగించవచ్చన్న వార్తలు వస్తున్నాయి. వీటిలో ఏమాత్రం నిజంలేదు. యధావిధిగా సోమవారం నుంచి స్కూల్స్ తెరుచుకుంటాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments