Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులపై నైజీరియన్ల దాడి... ఒకరి అరెస్టు

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2015 (09:38 IST)
దేశం కాని దేశం వచ్చారు. అయితే వారి వృత్తి ఏమిటో ఇక్కడకు ఎందుకు వచ్చారో కూడా తెలియకపోయినా వారు చేసేది మాత్రం మోసాలు.. చీకటి వ్యాపారాలే అనే విషయం స్పష్టం. ఇందులో నైజీరియన్లు హైదరాబాద్  పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా శనివారం తెల్లవారు జామున ఓ ఎస్ ఐ బృందంపై దాడి చేశారు. వారిలో ఒకరు పట్టుబడగా.. మరో ఇద్దరు పరారయ్యారు. వివరాలిలా ఉన్నాయి. 
 
అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత టోలిచౌకి ఎస్ఐ బాలకిషన్ గౌడ్ బృందం లంగర్హౌస్ బాపూఘాట్ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తోంది. అంతలో అటుగా కారులో వచ్చిన ముగ్గురు నైజీరియన్లు ఎస్ఐ మీద దాడికి పాల్పడ్డారు. కారు ఆపమన్నందుకు దాడి చేశారు. వాళ్లను పట్టుకోబోతుండగా ఇద్దరు పారిపోయారు. మరొకరిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
వీసా గడువు ముగిసినా కూడా అక్రమంగా నివాసం ఉంటున్న నైజీరియన్లు పలు రకాల మోసాలకు కూడా పాల్పడుతున్నారు. నైజీరియన్ చట్టాల ప్రకారమే వారిని విచారించాల్సి రావడంతో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించలేక పోతున్నామని వాపోతున్నారు.
 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments