Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూరగాయలు కోసే చాకుతో భార్య పీక కోశాడు : భర్త కిరాతకం

ఆ మహిళ పాలిట ప్రేమ శాపమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాలయముడయ్యాడు. కూరగాయలు కోసే చాకుతో ఆమె పీక (గొంతు) కోశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా శ్రీరాంనగర్‌లో జరిగింది. తాజాగా వెల

Webdunia
ఆదివారం, 22 జనవరి 2017 (09:51 IST)
ఆ మహిళ పాలిట ప్రేమ శాపమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాలయముడయ్యాడు. కూరగాయలు కోసే చాకుతో ఆమె పీక (గొంతు) కోశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా శ్రీరాంనగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జులరావుపేటకు చెందిన కొణతాల వెంకన్న అనే వ్యక్తి ట్రాలీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన తన సమీప బంధువు అప్పారావు కూతురు రేణుక(25)ను ప్రేమించి, పెళ్లి చేసుకొన్నాడు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత ఈనెల 11న శ్రీరాంనగర్‌లో ఇల్లు అద్దెకుతీసుకుని కాపురం పెట్టారు. 
 
ఇంతలో వారిమధ్య ఏంజరిగిందో ఏమో తెలియదుకానీ భార్యను భర్త హత్య చేశాడు. శనివారం ఉదయం వెంకన్న ఇంటికి తాళం వేసి వెళుతుండటాన్ని ఇంటి యజమాని ప్రశ్నించాడు. అయితే, వెంకన్న సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. అయితే, రేణుక తల్లి పుష్పరాజ్యం శుక్రవారం సాయంత్రం నుంచే రేణుకకు ఫోన్‌ చేస్తూ వచ్చింది. కానీ రేణుక ఫోన్ లిప్టు చేయక పోవడంతో అనుమానం వచ్చింది. 
 
ఆ వెంటనే ఆమె రేణుక ఇంటికి వచ్చేసరికి తాళం వేసి ఉంది. అనుమానంతో తాళం పగులగొట్టిచూడగా రేణుక మృతదేహం రక్తపుమడుగులో పడి ఉంది. కూరగాయాలు కోసే చాకుతో ఆమె మెడకోసి హత్య చేసినట్టు గుర్తించారు. పోలీసులకు సమాచారం చేరవేయగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments