శోభనం అర్థరాత్రి వరకు భర్తతో... ఆ తరువాత ప్రియుడితో జంప్.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (19:04 IST)
నిజమైన ప్రేమ ఎప్పటికీ నిలుస్తుందని పెద్దలు చెబుతుంటారు. తల్లిదండ్రులు బలవంతంగా ప్రేమించుకున్న జంటను విడదీసి వివాహం చేసినా వారు ఖచ్చితంగా విడిపోయి ఎప్పుడో ఒకసారి కలవడం ఖాయం. అలాంటి సంఘటనే చిత్తూరులో జరిగింది. పెళ్ళయిన రోజు రాత్రే భర్తతో అర్థరాత్రి వరకు గడిపి ఆ తరువాత ప్రియుడితో పరారైంది ఓ వివాహిత. 
 
గిరింపేటకు చెందిన రంజిత్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన 23 యేళ్ళ ఒక యువతిని ఇచ్చి వివాహం చేశారు. వివాహం ఎంతో ఆర్భాటంగా జరిగింది. అయితే యువతి తన పెళ్ళికి ముందు గాంధీవీధికి చెందిన మరో యువకుడితో నాలుగేళ్ళుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలుసు. తమ కుమార్తె ప్రేమించిన యువకుడు బలాదూర్‌గా తిరుగుతూ ఉండటంతో అతనికి ఇచ్చి పెళ్ళి చేయడం ఇష్టం లేక బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు.
 
అయితే ఆ యువతి పెళ్ళయితే చేసుకుంది కానీ భర్తతో సంసారం చేయలేకపోయింది. శోభనం రోజు అర్థరాత్రి వరకు భర్తతో ఉన్న ఆ వివాహిత ఆ తరువాత ప్రియుడితో కలిసి పారిపోయింది. అయితే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు తల్లిదండ్రులు. తమ పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో విషయం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తపడ్డారు. కానీ బంధువుల ద్వారా అసలు విషయం బయటకు వచ్చేసింది. ప్రియుడితో పారిపోయిన యువతి కోసం బంధువులే వెతుక్కుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments