Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పుట్టిన రోజున కొత్త పథకం

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (09:19 IST)
డిసెంబర్ 21న సీఎం జగన్ బర్త్ డే. అదే రోజు ఏపీలో అత్యంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే భారీ పథకాన్ని జగన్ ప్రారంభించబోతున్నారు. డిసెంబర్ 21న అందరికీ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వనున్నారు.

లబ్ధిదారులకు సంబంధించిన హెల్త్ డేటా అందులో ఉంటుంది. ఆ కార్డుతో ఏ ఆస్పత్రికి వెళ్లినా.. వారి అనారోగ్య సమస్యల డేటా మొత్తం తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి సమూలంగా మార్చేస్తున్నట్టు సీఎం తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 1000 వ్యాధులకు చికిత్స అందిస్తున్నారని, వాటి సంఖ్య 2వేలకు పెంచుతామని సీఎం చెప్పారు.

డెంగ్యూ, మలేరియా వంటి వాటిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. జనవరి 1 నుంచి 2వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చుతామన్నారు.
 
పైలట్ ప్రాజెక్ట్ గా ప.గో. జిల్లాలో అమలు చేస్తామని సీఎం చెప్పారు. ఆ తర్వాత ప్రతి నెల ఒక్కో జిల్లాకు పెంచుతామని హామీ ఇచ్చారు.
 
 ఏపీలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ ప్రైవేట్ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని సీఎం జగన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments