Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్‌ ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (07:49 IST)
నాణ్యమైన బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన జగన్‌.. శ్రీకాకుళంలో నాణ్యమైన బియ్యం సరఫరా ఎలా జరుగుతోందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రజల నుంచి మంచి స్పందన ఉందని.. బియ్యం సరఫరా సాఫీగా సాగుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.
 
ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని సేకరించేలా ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్‌. శ్రీకాకుళం జిల్లా స్ఫూర్తితో ఏప్రిల్‌ 1 నుంచి అన్ని జిల్లాలకు నాణ్యమైన బియ్యం పంపిణీ జరిగేలా కార్యచరణను సిద్ధం చేయాలన్నారు.

క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దన్నారు. అలాగే రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న సంచులను రీసైక్లింగ్ కోసం తిరిగి వెనక్కి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు ముఖ్యమంత్రి జగన్‌.
 
కొత్త రేషన్‌కార్డు జారీకి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిసెంబర్‌ ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లబ్దిదారులను త్వరితగతిన ఎంపిక చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కొడాలి నాని, సివిల్ సప్లైస్‌ కమిషనర్ కోన శశిధర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments