Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో సర్కారీ మద్యం షాపులు.. యువతకు ఉద్యోగాలు

Webdunia
ఆదివారం, 14 జులై 2019 (11:28 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో సర్కారీ మద్యం షాపులను పెట్టనుంది. ఈ మేరకు సరికొత్త మద్యం విధానాన్ని ప్రకటించనుంది. ఈ సర్కారీ మద్యం షాపులో ఒక్కో షాపులో నలుగురు యువతకు ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇందుకోసం కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించనుంది. కొత్త మద్యం పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తోంది. ఇందుకుగాను పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. 
 
ప్రభుత్వమే సొంతంగా మద్యం షాపులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికిగాను ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. వాస్తవానికి జూన్‌ నెలాఖరుతో మద్యం షాపుల గడువు ముగిసింది. కానీ కొత్త ప్రభుత్వం కొలువుదీరడం.. మద్యం పాలసీ రూపొందించడంలో జాప్యంతో మద్యం షాపులకు మరో మూడు నెలలు గడువు పెంచారు. అయితే షాపుల సంఖ్యను కుదించారు. ప్రస్తుతం నూతన మద్యం విధానం తయారుచేయడంలో సంబంధిత శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. 
 
సంస్కరణలతో ముందుకు... 
మద్యం పాలసీ విధానంలో సరికొత్త సంస్కరణలు తీసుకురావడం ద్వారా దశలవారీగా మద్యం నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఏటా 25 శాతం మద్యం దుకాణాలు తగ్గించాలని నిర్ణయించింది. మూడు నెలల పాటు షాపుల నిర్వహణ గడువు పెంచినా... వాటి సంఖ్య మాత్రం ఇప్పటికే తగ్గించారు.
 
సాయంత్రం ఆరు గంటలు దాటితే మద్యం విక్రయాలను నిలిపివేయాలని కూడా నిర్ణయించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా కొత్త కొత్త ఆంక్షలు, నిబంధనలు విధించడం ద్వారా మద్యం నిషేధం వైపు ప్రభుత్వం అడుగులేస్తోంది.
 
ఒక్కో మద్యం షాపులో ముగ్గురు సేల్స్‌‌మెన్లు, ఒక సూపర్‌వైజర్‌ను నియమించాలని ఎక్పైజ్‌ శాఖ ప్రతిపాదనలు పంపించింది. మద్యం షాపులో సూపర్‌వైజర్‌గా పనిచేసే వ్యక్తి నుంచి డిపాజిట్‌ సేకరించనున్నారు. షాపు ఆర్థిక లావాదేవీలన్నింటికీ సూపర్‌వైజర్‌నే బాధ్యుడుగా చేయనున్నారు. ఇలా నియమించిన సిబ్బంది జీతభత్యాలు, ఇతరత్రా అలవెన్సుల విషయంపై ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. కొద్దిరోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.
 
తమిళనాడు తరహాలో... 
ప్రభుత్వ మద్యం దుకాణాలు పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఉన్నాయి. అక్కడి విధానమే మన రాష్ట్రంలో అమలు చేయాలన్నది ప్రభుత్వ భావన. ఈ విధానం అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమలు చేయడానికి యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జనాభా ప్రాతిపదికన షాపులను ఏర్పాటు చేస్తారు. షాపుల్లో ప్రభుత్వమే సిబ్బందిని నియమిస్తోంది. ప్రతి రోజు జరుగుతున్న విక్రయాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. 
 
దుకాణానికి వచ్చిన నిల్వ, విక్రయాలలో తేడా ఉంటే పనిచేసే సిబ్బందిపై కఠిన చర్యలకు ఉపక్రమించనున్నారు. తద్వారా బెల్టు షాపులు, లూజు విక్రయాలు తగ్గుముఖం పట్టనున్నాయి. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించడం వల్ల ఎక్సైజ్‌, అబ్కారీ శాఖపై అదనపు భారం పడనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments