Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూ డేమోక్రసి దళ కమాండర్ లింగన్న ఎన్కౌంటర్

Webdunia
బుధవారం, 31 జులై 2019 (22:38 IST)
న్యూ డెమోక్రసీ పార్టీ అజ్ఞాత దళానికి, పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో న్యూ డెమోక్రసీ దళ కమాండర్ మృతి చెందగా దళానికి సంబంధించిన, ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన గుండాల మండలంలో జరిగింది. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం అలగడ్డ సమీప అడవిలో పంది గుట్టమీద లింగన్న దళం గత మూడు రోజుల నుండి విశ్రాంతి తీసుకుంటోందన్న సమాచారం తెలిసిన పోలీస్ గ్రే హాండ దళాలు గుట్టను చుట్టుముట్టి లింగన్న దళంపై కాల్పులు జరపడంతో లింగన్న మృతి చెందాడు. ఐదుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా సంఘటనా స్థలానికి ప్రజలను, మీడియాను వెళ్లకుండా సుమారు రెండు గంటలపాటు అడ్డుకున్నారు. అనంతరం జనం గొడవ చేయగా పోలీసులు వదిలి పెట్టారు. జనమంత గుట్ట పైకి వెళ్లే లోగా గుట్ట వెనుక నుండి మృతదేహాన్ని కిందికి దించి వెళ్లిపోతున్న సమయంలో ప్రజల అడ్డుకోగా లింగన్న మృతదేహాన్ని వదిలిపెట్టి కొంతమంది పోలీసులు వెళ్లిపోయారు.

మరికొంతమంది ఆ మృతదేహాన్ని తీసుకోవడానికి రావడంతో ప్రజలు రాళ్లతో పోలీసులపై దాడి చేయగా కానిస్టేబుల్ గాయాలయ్యాయి. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments