Webdunia - Bharat's app for daily news and videos

Install App

15న నెల్లూరు జిల్లాలో చేపల వేటపై నిషేధం.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (16:43 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఆ ప్రయోగ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటల సమయంలో జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 ద్వారా చంద్రయాన్‌-2 రాకెట్‌ ప్రయోగం నిర్వహించనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆ రోజు వేకువజాము ఒంటిగంట నుంచి 4 గంటల మధ్యలో మత్స్యకారులు ఎవరూ నిర్ణీత అపాయకర ప్రాంతమైన పులికాట్‌ లైట్‌హౌస్‌ నుంచి ఆర్మగాన్‌ లైట్‌హౌస్‌ వరకు చేపలవేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ఒక ప్రకటనలో ఆదేశించారు. ఈ విషయమై మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు, తహసీల్దార్లు, వీఆర్‌వోలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ ప్రమాదానికి గురికాకుండా పర్యవేక్షించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments