Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు మేకల జత ధర రూ.1.50 లక్షలు

Webdunia
గురువారం, 22 జులై 2021 (11:51 IST)
బక్రీద్ పండుగను పురస్కరించుకుని మేకలు వేలం వేయగా, ఇందులో నెల్లూరు మేకలకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఒక జత మేకలకను లక్ష యాభై వేల రూపాయలు పలికాయి. నెల్లూరు జిల్లా సంతపేటలో ఈ మేకల వేలం జరిగింది. 
 
ఈ సంతలో వేలూరు, తిరువణ్ణామలై, తిరువళ్లూర్‌, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మేకలను వేలం వేస్తుంటారు. ప్రతి వారం ఈ వేలం పాటలు జరుగుతుంటాయి. రాష్ట్రానికి చెందిన మేకల జత రూ.50 వేల వరకు విక్రయం కాగా, నెల్లూరుకు చెందిన మేకల జత రూ.1.50 లక్షలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. 
 
ఈ విషయమై నెల్లూరు వ్యాపారులు మాట్లాడుతూ, నెల్లూరు తెల్లరకం మేక బరువు 25 కిలోలు వుంటుందని, మాంసం కోసమే ఈ మేకల్ని సంరక్షిస్తున్నామన్నారు. ఈ రకం మాంసం రుచి కూడా బాగుండడంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారని తెలిపారు. 
 
కాగా, రాణిపేట, వేలూరు, తిరుపత్తూర్‌ జిల్లాల్లో రెండు రోజులుగా సుమారు 20 ప్రాంతాల్లో నిర్వహించిన మేకల సంతలో రూ.25 కోట్ల విక్రయాలు జరిగాయని నిర్వాహకులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments