Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోలు నడిపితే వచ్చే సంపాదన చాలడంలేదనీ.. అమ్మాయి అందాన్ని ఎరగా వేసి..

Webdunia
గురువారం, 16 మే 2019 (15:05 IST)
ఆటోలు నడిపడం వల్లే సంపాదన సరిపోవడం లేదనీ ముగ్గురు స్నేహితులు ఓ యువతి అందాన్ని ఎరగావేసారు. ఆ కిలాడీ లేడీ ద్వారా లారీ డ్రైవర్లు, ఇతర వాహనచోదకులను దోపిడీ చేస్తూ డబ్బులు సంపాదించసాగారు. చివరకు వారి పాపం పండి పోలీసులకు చిక్కారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా ఆమంచర్ల గ్రామానికి చెందిన మల్లి శ్రీనివాసులు, వీరేశం, మట్యంపాటి అనిల్‌ అనే ముగ్గురు యువకులు మంచి స్నేహితులు. వీరంతా ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. 
 
వీరిలో అనిల్‌కు రమాదేవి అనే యువతి పరిచయమైంది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, తాము నడుపుతున్న ఆటోల వచ్చే సంపాదన సరిపోవడం లేదని భావించిన ఈ ముగ్గురు మిత్రులు.. రమాదేవి అందాన్ని ఎరగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. 
 
తమ ప్లాన్‌లో భాగంగా, సాయంత్రానికి రమాదేవిని బాగా మేకప్ చేయించి ఆటోలో జాతీయ రహదారిపైకి తీసుకెళ్లి ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డుపై నిలబెట్టేవారు. ఆ తర్వాత ఈ ముగ్గురు ఆటోలోనే చెట్ల చాటున నక్కేవారు. 
 
వాహనచోదకులు ఎవరైనా రమాదేవిని చూసి ఆకర్షితులై శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపితే... అతన్ని పక్కకు వెళ్దామని చెప్పి చీకట్లోకి రమాదేవి తీసుకెళ్తుంది. ఆపై అందరూ కలిసి దాడి చేసి, అతని వద్ద ఉండే నగలు, నగదు లాగేసుకుని, ఆటోలో పారిపోయేవారు. ఈ తంతు గత కొన్ని నెలలుగా సాగుతోంది. 
 
ఈ క్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన బత్తల శివాజీ అనే లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిఘా పెట్టి, సుందరయ్య కాలనీ దాటిన తర్వాత నిర్జన ప్రదేశంలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద ప్రశ్నించగా అసలు విషయం వెల్లడించారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందుకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments