Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లబజారులో ఆనందయ్య మందు... పోలీసుల వలయంలో ఆనందయ్య

Webdunia
మంగళవారం, 25 మే 2021 (11:52 IST)
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఆయుర్వేద వైద్య నిపుణులు ఆనందయ్య ఆయుర్వేదిక్ మందును నిలిపివేసినప్పటికీ బ్లాక్‌లో దందా కొనసాగుతోంది. హైదరాబాద్‌కు చెందిన రవి తన బంధువుల కోసం ఐ డ్రాప్స్‌ను రూ.20వేలకు బేరం కుదుర్చుకున్నాడు. డబ్బు చెల్లించే క్రమంలో రవి స్నేహితుడు సాయి అనే వ్యక్తి ఉచితంగా ఇచ్చే దానికి రూ.20,000 ఎందుకు అని ప్రశ్నించాడు. 
 
దీంతో కృష్ణపట్నం నాగరాజు అనే వ్యక్తి డబ్బులు లాక్కుని పరారయ్యాడు. సాయి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మందు హానికరం కాదని నివేదిక రావడంతో మరింత డిమాండ్ పెరిగింది. దీంతో కృష్ణపట్నంలోకి పోలీసులు ఎవరిని అనుమతించకపోవడంతో... కృష్ణపట్నం గ్రామస్తులు ఫోన్ ద్వారా బేరసారాలు ఆడుతున్నట్లు సమాచారం.
 
మరోవైపు, ఆయుర్వేద వైద్య నిపుణుడు బొణిగ ఆనందయ్య ప్రస్తుతం పోలీసుల వలయంలో ఉన్నారు. ఆనందయ్యను సీవీఆర్ అకాడమీలోని ఆరవవ బ్లాక్‌లో ఉంచారు. ఆనందయ్యతో పాటు ఆయన కుమారుడు, సోదరుడి కుమారుడు ఉన్నారు. ఆనందయ్యతో మాట్లాడేందుకు ఎవరికీ అనుమతి లేదని పోలీసులు స్పష్టంచేశారు. 
 
సీవీఆర్ అకాడమీలో ఐసీఎంఆర్ పరీక్షల కోసమంటూ మందు తయారు చేయించి... ఆ మందును పోలీసులు, వైసీపీ నేతలు తీసుకెళ్లారు. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీ కోసం ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు. మందు పంపిణీలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments