Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో గవర్నర్.. అయినా వెనక్కి.. అధికారుల నిర్లక్ష్యం..!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (14:59 IST)
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి రప్పించారు. శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది నిర్లక్ష్యం, వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. గవర్నర్ నరసింహన్ మూడురోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ బయల్దేరారు.
 
అయితే విమానం అరగంట ప్రయాణించిన అనంతరం ప్రయాణికుల లగేజ్ లోడ్ చేయలేదని గ్రహించారు. వెంటనే వెనక్కి రావాల్సిందిగా పైలట్కు సమాచారం అందటంతో మళ్లీ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.  
 
లగేజ్ లోడ్ అయిన అరగంట తర్వాత విమానం ఢిల్లీ బయల్దేరింది. అయితే గవర్నర్ ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి రప్పించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా విచారణకు ఆదేశించింది.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments