కేసీఆర్ మాట తప్పారు... రసం లేని ఆర్టీసీ ఛైర్మన్ గిరి ఇస్తామన్నారు... వద్దన్నా : నాయని ఫైర్

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (15:58 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెరాస సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రిగా పని చేసిన నాయిని నర్సింహా రెడ్డి విమర్శలు గుప్పించారు. తనకు పదవి ఇస్తామని కేసీఆర్ మాట తప్పారంటూ మండిపడ్డారు. పైగా, రసం లేని ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇస్తామని ఆఫర్ చేశారనీ, ఆ పదవిని వద్దని చెప్పినట్టు తెలిపారు. 
 
ఆయన సోమవారం అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ టికెట్ అడిగితే... 'ముఠా గోపాల్‌ను గెలిపించుకునిరా... నిన్ను మంత్రిని చేస్తా'నని కేసీఆర్ మాట ఇచ్చారని... ఇప్పుడు ఆ మాట తప్పారని మండిపడ్డారు.
 
హోంమంత్రిగా పని చేసిన తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఎందుకని ప్రశ్నించారు. తెరాస పార్టీకి కేసీఆర్ ఓనర్ అయితే, తాను కూడా ఓనర్‌నేనని వ్యాఖ్యానించారు. పార్టీలోకి కిరాయికి వచ్చిన వారు ఎప్పుడు దిగిపోతారో తెలియదన్నారు. అలాగే, తన అల్లుడుకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారని, ఇపుడు అవన్నీ ఆయన మరచిపోయారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments