Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీల భోజనంలో నాణ్యత పెంచుతాం: నాయిని నర్సింహారెడ్డి

Webdunia
సోమవారం, 28 జులై 2014 (16:30 IST)
తెలంగాణలో జైళ్ల సంస్కరణలకు పెద్దపీట వేస్తామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. అర్హులైన ఖైదీలను విడుదల చేస్తామన్నారు. సోమవారం చర్లపల్లి జైలును సందర్శించారు. జైళ్ల అభివృద్ధి కోసం దేశంలోని జైళ్లకు ప్రత్యేక టీమ్లను పంపిస్తామన్నారు. 
 
ఈ సందర్భంగా జైలులోని బియ్యం, దుప్పట్లను నాయిని పరిశీలించారు. ఖైదీల భోజనంలో నాణ్యత పెంచుతామని ఆయన తెలిపారు. ఇక జైళ్లలో సెల్ఫోన్లు, గంజాయి వినియోగించే ఖైదీలు.... వారికి సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని నాయిని స్పష్టం చేశారు. జైళ్లలో వైద్యుల కొరతను తీరుస్తామని హామీ ఇచ్చారు.
 
క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల విడుదలకు కసరత్తు చేస్తున్నామని, ఖైదీల క్షమాభిక్షపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని నాయిని తెలిపారు. త్వరలో ఖైదీలను విడుదల చేయటం సాధ్యం కాకపోవచ్చన్నారు. మార్గదర్శకాలను రూపొందించి అర్హులైన ఖైదీలను విడుదల చేస్తామన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments