Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్‌కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసు

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (13:31 IST)
ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు జాతీయ ఎస్టీ ఎస్టీ కమిషన్ నోటీసు జారీచేసింది. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం గోవర్ధనపురం పంచాయతీ అర్లి గ్రామానికి చెందిన పాలకొండ నిర్మల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషన్‌ నోటీసు జారీచేసింది. 
 
జిల్లాలో ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌ (ఐఈఆర్పీ) ఒప్పంద పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని, తన పేరు ఓపెన్‌ కేటగిరీలో మొదటి స్థానంలో ఉన్నా ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారని జాతీయ ఎస్టీ కమిషన్‌ను నిర్మల ఆశ్రయించారు. 
 
దీనిపై స్పందించిన కమిషన్‌ గత నెల 17వ తేదీన ముఖ్య కార్యదర్శికి నోటీసు జారీచేసింది. ఏడు రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించగా నెల రోజులు గడిచినా పంపకపోవడంతో కమిషన్‌ తీవ్రంగా పరిగణించినట్లు నిర్మల తెలిపారు. 
 
వచ్చే నెల 2న నేరుగా ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్‌ ముందు పూర్తి వివరాలతో హాజరుకావాలని ఆయనకు మరో నోటీసు జారీచేశారని చెప్పారు. తనకు కూడా పూర్తి వివరాలతో హాజరు కావాలని నోటీసు జారీచేసినట్లు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments