Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసాపురం వైసీపీలో వర్గ విబేధాలు: కొనసాగుతున్న హైడ్రామా

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (14:46 IST)
నరసాపురం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో సందర్భంగా వైసీపీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కో ఆప్షన్ సభ్యుల పేర్లను ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వర్గం కౌన్సిలర్లు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గం కౌన్సిలర్లు వేర్వేరుగా ప్రతిపాదించారు. 
 
ఎమ్మెల్యే ముదునూరి వర్గం మాజీ కౌన్సిలర్ ఏడిదకోట సత్యనారాయణ అభ్యర్ధిత్వానికి, కొత్తపల్లి వర్గం మాజీ కౌన్సిలర్ బల్ల వెంకటేశ్వరరావుకు మద్దతు ఇచ్చింది. వైసీపీలో వర్గ విబేధాల నేపథ్యంలో ఎన్నిక నిలిచిపోయింది. అటు కౌన్సిల్లో హైడ్రామా కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై పార్టీ అధినేతలతో మంతనాలు సాగుతున్నాయి.  
 
కొత్తపల్లి సుబ్బారాయడు 1989లో నర్సాపురం నుంచి టీడీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1994, 1999, 2004లో కూడా గెలిచారు. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు చేతిలో ఓడారు. 
 
2012లో కాంగ్రెస్ నుంచి నర్సాపురం ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచారు. 2014లో వైసీపీలో చేరి నర్సాపురం నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తర్వాత మళ్లీ టీడీపీలో చేరగా.. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కింది. 
 
ఎన్నికలు రావడంతో నర్సాపురం నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో మళ్లీ వైసీపీ గూటికి వెళ్లారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే ప్రసాదరాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు గ్రూపులు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments