Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయణ కళాశాలలో మరో విద్యార్థిని యవ్వన ఆత్మహత్య(వీడియో)

కారణాలు ఏమయినప్పటికీ నారాయణ కళాశాలలో చదివే విద్యార్థుల్లో కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని నారాయణ కళాశాల హాస్టల్‌లో యవ్వన అనే విద్యార్థిని ఆత

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (15:30 IST)
కారణాలు ఏమయినప్పటికీ నారాయణ కళాశాలలో చదివే విద్యార్థుల్లో కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని నారాయణ కళాశాల హాస్టల్‌లో యవ్వన అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కళాశాలలోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.
 
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యెం మండలానికి చెందిన యవ్వన తిరుపతి నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. మూడు రోజుల క్రితం తన అన్నతో కలిసి సొంత ఊరికి వెళ్ళివచ్చింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ తమతో కలవకుండా ముభావంగా ఉండేదని యవ్వన స్నేహితులు చెబుతున్నారు. అయితే నిన్న రాత్రి స్టడీ అవర్‌లో యవ్వన స్నేహితులందరూ కళాశాల ఆవరణలో చదువుకుంటూ వుండగా యవ్వన తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
విద్యార్థిని ఆత్మహత్య విషయాన్ని గోప్యంగా ఉంచిన నారాయణ కళాశాల యాజమాన్యం మృతదేహాన్ని రుయా ఆసుపత్రి మార్చురికి పంపించేశారు. నారాయణ కళాశాల యాజమాన్యంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వీడియో చూడండి...
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments