Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారప్ప డైలాగ్ చెప్పిన ఎమ్మెల్సీ ల‌క్ష్మ‌ణ‌రావు...పిల్ల‌ల కేరింత‌లు!

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (11:07 IST)
"మన దగ్గర భూముంటే తీసేసుకుంటారు... డబ్బుంటే లాగేసుకుంటారు... కానీ చదువును ఒక్కటి మాత్రం మనదగ్గర్నుంచి ఎవరూ తీసుకోలేరు చిన్నప్ప..." అంటూ నారప్ప సినిమాలోని డైలాగ్ ను పలికారు ఎమ్మెల్సీ కె.యస్. లక్ష్మణరావు. దీంతో విద్యార్థులందరూ ఒక్కసారిగా కేరింతలు కొట్టారు.

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనబడి నాడు - నేడు మొదటి దశ ప్రజలకు అంకితం, రెండవ దశ పనులు ప్రారంభం, జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కె.యస్. లక్ష్మణరావు విశిష్ట అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య ప్రాముఖ్యం గురించి వివరిస్తూ, నారప్ప సినిమాలోని డైలాగును ఉదహరించారు. విద్యార్థులు లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలపై ప్రశంసలను గుప్పించారు.

నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద వంటి పథకాలకు శాసనమండలిలో ఆమోదం తెలిపిన విషయాలను ఎమ్మెల్సీ లక్ష్మణరావు గుర్తు చేశారు. చ‌దువుకు ఉన్న ప్రాముఖ్యాన్ని చిన్న వ‌య‌సులోనే గుర్తించాల‌ని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments