Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ఎన్నికల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి నారా లోకేషే : తిరుపతి జ్యోతిష్యుడు

Webdunia
ఆదివారం, 29 మే 2016 (09:32 IST)
నారా లోకేష్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. పార్టీ పదవి కంటే కూడా చంద్రబాబు తనయుడిగా గుర్తింపే ఎక్కువ. తండ్రిచాటు బిడ్డగా పెరిగిన నారా లోకేష్ ఇపుడు క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించి, టీడీపీ శ్రేణులతో మమేకమై పోతున్నాడు. దీంతో ఆయనకు మంత్రిపదవి కట్టబెట్టాలన్న డిమాండ్లు పుట్టుకొచ్చాయి. ఈ విషయంలో చంద్రబాబు అనుచరులు కాస్తంత గట్టిగానే అరిచిగీపెట్టారు. అయితే, రాజకీయ సమీకరణాలు, వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని లోకేష్‌కు చంద్రబాబు మంత్రిపదవి కట్టబెట్టలేదు. 
 
ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ అవుతారంటూ తిరుపతికి చెందిన శ్రీరాజరాజేశ్వరి జ్యోతిషాలయం వ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్యస్వామి ఘంటాపథంగా చెపుతున్నారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ 'ఇది నామాట. నామాటే వేదవాక్కు. నా మాట తప్పిన సందర్భంలేదు. గతాన్ని తరచి చూసుకోండి.. నేను చెప్పిన వన్నీ జరిగిపోయాయి. భవిష్యత్తూ అంతే. 2019 సాధారణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాలోకేష్' అంటూ ఆయన కుండబద్ధలు కొడుతున్నారు. 
 
దీనికి కారణం.. గ్రహబలం, వాస్తురీత్యా ఇది ముమ్మాటికీ నిజమౌతుందంటున్నారు. 2011లో జయలలిత ముఖ్యమంత్రి అవుతారని చెప్పానని ఆ యేడాది జరిగిన ఎన్నికలకు ముందే చెప్పానని ఆయన గుర్తు చేశారు. 2016 ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకే పార్టీనే గెలుస్తుందని, అధినేత్రి జయలలితే మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పగా, అది కూడా ఫలించినట్టు తెలిపారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments