Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఆసక్తికరం దృశ్యం : జనసేన ఆఫీసులో నారా లోకేశ్

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (08:52 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన నారా లోకేశ్... అక్కడ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించారు. 
 
ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కుంచనపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్టీ విషయాలను జనసేన పార్టీ నేతలతో చర్చించారు. 
 
అయితే, వైకాపా నేతలు ఇప్పటికే జనసేన పార్టీని టీడీపీ బి టీమ్‌గా పేర్కొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే జనసేనాని పవన్ కళ్యాణ్ తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ వైకాపా మంత్రులు, నేతలు పదేపదే చేస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేశ్ ఇపుడు జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళి, వైకాపా నేతలకు మరింత అవకాశం కల్పించారు.
 
దీనిపై టీడీపీ నేతలు స్పందించారు. కేవలం మర్యాదపూర్వకంగానే నారా లోకేశ్, జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారని, ఇందులో ఎలాంటి ఉద్దేశాలు, దురుద్దేశాలు లేవని వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

కుటుంబ కలహాలు... షార్ట్ ఫిలిం కో-డైరెక్టర్ శివ ఆత్మహత్య

ధనుష్, సందీప్ కిషన్ సన్ ల రాయన్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఫిక్స్

కర్నాటక, హైదరాబాదు లో ప్రతి లొకేషన్ కి నెమలి వచ్చేది: హరోం హర డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక

తుఫాను హెచ్చరిక టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

యేవ‌మ్ టీమ్‌ను చూస్తుంటే ముచ్చ‌ట‌గా వుంది: మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

తర్వాతి కథనం
Show comments