వారెవ్వా.. రాజన్న రాజ్యంలో ఎమ్మెల్యేల దుస్థితి ఇదీ.. లోకేశ్ ట్వీట్

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (14:22 IST)
వారెవ్వా.. రాజన్న రాజ్యంలో ఎమ్మెల్యేల దుస్థితి అత్యంత హీనంగా ఉందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, మంగళవారం ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వారంతా బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్‌తో బలవంతంగా బయటకు పంపించారు. 
 
దీనిపై నారా లోకేశ్ ట్వీట్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలను బయటకు తరలిస్తున్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన లోకేశ్.. దానికింద ట్వీట్ చేశారు. "వారెవ్వా... ప్రజల పక్షాన నిలిస్తే..  రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదీ..!" అంటూ కామెంట్స్ చేశారు. 
 
కాగా, సభా కార్యక్రమాలకు నిత్యమూ అడ్డుపడుతున్నారన్న కారణంతో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చెయ్య చౌదరిలను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ దాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments