2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేశారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీ ప్రజలను అనాధలుగా వదిలేశారని.. రాష్ట్ర విభజన వల్ల మనకు చాలా నష్టం జరిగిందని నారా లోకేష్ ఆవేదన వ్య
2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేశారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీ ప్రజలను అనాధలుగా వదిలేశారని.. రాష్ట్ర విభజన వల్ల మనకు చాలా నష్టం జరిగిందని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గడిచిన మూడేళ్లలో మన రాజధానిని మనం ఏర్పాటు చేసుకున్నామన్నారు. రైతన్నను భాగస్వామ్యం చేసుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు.
ఏపీకి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అట్లాంటాలో పర్యటిస్తున్న నారా లోకేష్ ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. 2019 నాటికి పోలవరం ద్వారా నీరు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని.. సంక్షేమ పథకాల అమలు తీరును మెచ్చుకుంటున్నారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు గారు ముందుచూపుతో ముందుకెళ్తూ.. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.