అది జాబ్ క్యాలెండర్ కాదు.. జాదూ క్యాలెండర్: నారా లోకేష్ ఫైర్

Webdunia
గురువారం, 15 జులై 2021 (23:11 IST)
ఏపీ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌‌పై  మండిపడ్డారు. ఈ మేరకు నిరుద్యోగ యువతతో సమావేశం నిర్వహించిన లోకేష్ వారితో చర్చించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం జగన్ మోహన్ రెడ్డి జాదూ క్యాలెండర్‌తో యువతకి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగులు పడుతున్న ఆందోళన చూస్తే బాధేస్తుందని పేర్కొన్నారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని నిరుద్యోగులు నిరుత్సాహ పడొద్దని లోకేష్ సూచించారు. ప్రభుత్వంపై కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు.
 
ఫ్యాన్ తిప్పుతూ అధికారం రాగానే 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని, 2 లక్షల 30 వేల ఉద్యోగాలకు ఒకే సారి నోటిఫికేషన్ అన్నారని, కానీ ఇప్పుడు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అదే ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.
 
వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన తరువాత 10 వేల ఉద్యోగాలతో జాదూ క్యాలెండర్ విడుదల చేసి యువతకి తీరని ద్రోహం చేసారని లోకేష్ మండిపడ్డారు. 2.30 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తారని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులు స్థోమతకు మించి అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకున్నారని…ఇప్పుడు వారంతా తిరిగి ఊరు వెళ్లలేక, అమ్మానాన్నలకు మొఖం చూపించలేక ఆందోళనలో ఉన్నారని ఆవేదన చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments