Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మహిళలకు ఇచ్చిన పింఛను హామీ ఏమైంది జాదూ రెడ్డి : నారా లోకేశ్

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (12:26 IST)
తెలుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్ప నుంచి పాదయాత్రను చేపట్టారు. ఈ యాత్ర ఆదివారానికి మూడో రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో భాగంగా, ఆదివారం శాంతిపురంలోని వివిధ వర్గాల మహిళలతో లోకేశ్ సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసరాల ధరల భారం మోయలేకపోతున్నామని.. పొదుపు సంఘాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్య నిషేధం హామీతో జగన్‌ అధికారంలోకి వచ్చారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల తాళిబొట్లను సీఎం తాకట్టు పెట్టారని ఆరోపించారు. 
 
మద్యం తయారీ, పంపిణీ, అమ్మకం.. ఇలా అన్ని చోట్లా జగన్‌ బినామీలే ఉన్నారన్నారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు పింఛను ఇస్తానన్న హామీ ఏమైందని జాదూ రెడ్డి అని లోకేశ్‌ ప్రశ్నించారు. ఎన్నో ఆంక్షలతో అమ్మఒడి లబ్ధిదారులను తగ్గించారని ఆరోపించారు. చట్టం లేకుండానే దిశ పీఎస్‌లు, వాహనాలు అంటూ మోసం చేస్తున్నారన్నారు. మహిళలపై అఘాయిత్యాలు చేసిన ఎంతమందికి 21 రోజుల్లో ఉరిశిక్ష వేశారని ఆయన నిలదీశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments