Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ బాబుకు ఇలా మొదలైంది... చంద్రబాబుకు అలా మొదలైంది... ఏంటవి?

ఇప్పుడిదే చర్చ... నారా లోకేష్ బాబుకు ఇలా మొదలైంది, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి అలా మొదలైంది అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే... సోమవారం నాడు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాబు చట్టసభలోకి అడుగుపెట్టే ఘట్టంలో భాగంగా ఎ

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (21:29 IST)
ఇప్పుడిదే చర్చ... నారా లోకేష్ బాబుకు ఇలా మొదలైంది, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి అలా మొదలైంది అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే... సోమవారం నాడు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాబు చట్టసభలోకి అడుగుపెట్టే ఘట్టంలో భాగంగా ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మామయ్య బాలకృష్ణ, ఇంకా మంత్రివర్గంలోని కీలక మంత్రులు కూడా వచ్చారు. తన అల్లుడు లోకేష్ పనితీరుకు నిదర్శనమే ఈ ఎమ్మెల్సీ అంటూ బాలయ్య సంబరం పడుతున్నారు. 
 
ఐతే అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టు నుంచి షాక్ ఇచ్చే వార్త వచ్చింది. అదేమిటంటే... ఓటుకు నోటు కేసును విచారించేందుకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. అటు లోకేష్ బాబు ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన సమయం... ఇటు కొత్త అసెంబ్లీ భవనంలో ఎంతో సంతోషంగా ఆశీనులై వున్న ఏపీ సీఎం చంద్రబాబు వున్న వైనం. ఈ సమయంలో సుప్రీంకోర్టు నుంచి ఇలాంటి వార్త రావడంతో తమ్ముళ్లు కాస్తంత కంగారుగా కనిపించారు. ఐతే ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు తెలిపిందనీ, దాన్ని తాము చేస్తామని, ఇందులో ఆందోళన చెందాల్సినదేముందో విపక్షాలు చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఏదేమైనప్పటికీ అబ్బాయి ఎంట్రీ నాడే ఇలా తండ్రి చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టు నుంచి ఓటుకు నోటు కేసు వ్యవహారం రావడం కాస్త ఇబ్బందిగా వుందంటూ కొందరు పేర్కొంటున్నారు. అసలే మనవాళ్లు సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. ఇప్పుడు దీని గురించి సెంటిమెంటుగా కొందరు మాట్లాడేసుకుంటున్నారు కూడా. ఇలాంటివి జస్ట్ లీవిట్ యార్ అన్నట్లు వదిలేయాలంటున్నారు మరికొందరు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌కు ఏమైంది? మేనేజర్ వివరణ...

విశాల్ ఆరోగ్యానికి ఏమైందంటే? ఖుష్బూ వివరణ

శ్రీలీలపై కన్నేసిన బాలీవుడ్ హీరోలు!!

Actress Ramya: ఆ సన్నివేశాలను తొలగించాలి... కోర్టును ఆశ్రయించిన నటి రమ్య

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments