Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జ‌గ‌న్ స్ట‌యిల్ లో.... శుభం ప‌లుకుతున్న చంద్ర‌బాబు!

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (11:03 IST)
పీక‌ల్లోతు స‌మ‌స్య‌లున్నా... న‌వ్వుతూ, పెళ్లిళ్ళ‌కు హాజ‌ర‌వుతున్న జ‌గ‌న్ స్ట‌యిల్ లోకి ఇపుడు ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చేసిన‌ట్లున్నారు. ఎంత సేపు రాజ‌కీయాల్లో మునిగి తేలే ఆయ‌న ఇపుడు వ‌రుస‌పెట్టి, వివాహాది శుభ కార్యాల‌కు హాజ‌ర‌వుతున్నారు. 
 
ఏపీ సీఎం జ‌గ‌న్ విరివిగా వివాహ వేడుక‌ల‌కు హాజ‌ర‌వుతున్న ఫోటోలు వైరల్ అవుతుండ‌గా, ఇపుడు ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు కూడా వివాహాది శుభ కార్యాల‌కు వ‌ర‌స‌పెట్టి హాజ‌ర‌వుతున్నారు. 
 
నిన్న రాత్రి కాంగ్రెస్ నాయ‌కుడు, పీసీపీ మాజీ అధ్య‌క్షుడు సాకే శైలజానాథ్ కుమారుని వివాహానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు హాజ‌ర‌య్యారు. వ‌ధూవ‌రుల‌కు త‌న‌దైన శైలిలో చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
అలాగే, త‌న మామ‌గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవరాలు రిసెప్షన్ కు నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి ఇద్ద‌రూ హాజ‌రై అశీర్వాదాలు అంద‌జేశారు. త‌మ కుటుంబంలో జ‌రిగిన శుభ కార్యానికి దంప‌తులు ఇద్ద‌రూ హాజ‌రై అభినంద‌న‌లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments