ఈ పదవితో నేను వైజాగ్ పిచ్చాసుపత్రిలో ఉన్నట్టుగా ఉంది.. నన్నపనేని రాజకుమారి
ఎలాంటి పదవులు వద్దని మొత్తుకున్నా వినకుండా తనకు బలవంతంగా పదవిని కట్టబెట్టారని టీడీపీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశ
ఎలాంటి పదవులు వద్దని మొత్తుకున్నా వినకుండా తనకు బలవంతంగా పదవిని కట్టబెట్టారని టీడీపీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నన్నపనేని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్‌గా నియమించిన విషయం తెల్సిందే.
అయితే, గురువారం రాత్రి గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... దేవినేని ఉమా మహేశ్వరావు తదితరులు తనకు బలవంతంగా పదవి ఇప్పించారన్నారు. తనకు పదవి ఇచ్చి నోరు కట్టేశారన్నారు. తాను ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, పార్టీ తరపున టీవీలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడకూదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల తనను కలిసిన దేవినేని పదవి ఎలా ఉందని అడిగారని, నాలుగేళ్ల తర్వాత వైజాగ్ పిచ్చాస్పత్రికి వచ్చి నన్నపనేని గురించి అడిగితే చెబుతారని తాను సమాధానం చెప్పానని నన్నపనేని చమత్కరించారు.