Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాల ఫైట్... గెలిచేదెవరు? ఓడేదెవరు? వేణుమాధవ్ ధైర్యమేంటి?(వీడియో)

నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రచారంలో భాగంగా తెదేపాను తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు నా

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (16:11 IST)
నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రచారంలో భాగంగా తెదేపాను తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు నాయుడు సర్కారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. అలాంటి నాయకుడికి ఉరిశిక్ష వేసినా తప్పులేదంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తెదేపా తీవ్రస్థాయిలో మండిపడింది. జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలను తగులబెట్టింది. మరోవైపు తెదేపాకు మద్దతు ఇచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేశారు. ఈ పరిణామం తెదేపాకు కాస్త దెబ్బ కొట్టినట్లే అయ్యింది. 
 
ఇంకోవైపు భూమా దంపతుల సెంటిమెంట్ వర్కవుటవుతుందని భావిస్తున్నారు. తెదేపాకు పవర్ స్టార్ పర్యటన లేకపోయినప్పటికీ హాస్య నటుడు వేణు మాధవ్ రంగంలోకి దిగి పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోజాపై సెటైర్లు వేస్తున్నారు. తెదేపా అభ్యర్థి గెలుపు నిర్ణయం అయిపోయిందనీ, మెజారిటీ ఎంత అనే దానిపైనే తాము ఆలోచన చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. మరి వేణు మాధవ్ ధైర్యమేంటో తెలియడంలేదు. ఇకపోతే నంద్యాలలో ఈ నెల 23న జరిగే ఎన్నికతో ఎవరి గెలుపో తేలిపోనుంది. వీక్లీ రౌండప్ కోసం ఈ వీడియో చూడండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments