Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఐరెన్ లెగ్' రోజా అడుగుపెట్టిందో కాలు తీసేస్తాం.. నంద్యాల 16వ వార్డు మహిళల వార్నింగ్

కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే.రోజాకు చేదు అనుభవం ఎదురైంది. నంద్యాల పట్టణంలోని 16వ వార్డులో ఆమె ప్రచారానికి వెళ్లగా స్థానిక మహిళల నుంచి తీవ్ర ప్ర

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (14:21 IST)
కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే.రోజాకు చేదు అనుభవం ఎదురైంది. నంద్యాల పట్టణంలోని 16వ వార్డులో ఆమె ప్రచారానికి వెళ్లగా స్థానిక మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ కారణంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐరెన్ లెగ్ రోజా తమ వార్డులో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఆ వార్డు ప్రజలు భీష్మించికూర్చొన్నారు. దీంతో ఆమె వెనుదిరగాల్సి వచ్చింది. శనివారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
శనివారం ఉదయం రోజా ఎన్నికల ప్రచారం చేస్తుండగా నియోజకవర్గంలోని 16వార్డులో టీడీపీ మహిళా కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. తమ వార్డులోకి అడుగుపెట్టిందంటే తగినశాస్తి చేస్తామంటూ హెచ్చరించారు. ముఖ్యంగా.. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్న శిల్పా చక్రపాణిరెడ్డి మహిళలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలపై మహిళా నేతగా మీరు ఎందుకు స్పందిచట్లేదని నిలదీశారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
 
పైగా, రోజా డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేస్తారు. తమ ప్రతిఘటనను మీరి వార్డులో ప్రచారం చేస్తే సహించే ప్రసక్తేలేదంటూ వారు హెచ్చరించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని రోజాకు నచ్చజెప్పి ప్రచారం చేయకుండా చేశారు. ఆ తర్వాత రోజా ప్రచారం ముగించుకుని వైసీపీ కార్యాలయానికి వెళ్లడంతో గొడవ సర్దుమనిగింది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments