Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమా నాగిరెడ్డికి గుండెపోటు.. భూమా కోసం ప్రార్థనలు చేద్దాం: చంద్రబాబు ట్వీట్

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గుండెపోటుకు గురైన ఆయనను ప్రాథమిక చికిత్సల నిమిత్తం హుటాహుటిన ఆళ్ళగడ్డ ఆస్పత్రిక

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (11:42 IST)
కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గుండెపోటుకు గురైన ఆయనను ప్రాథమిక చికిత్సల నిమిత్తం హుటాహుటిన ఆళ్ళగడ్డ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్య సేవల నిమిత్తం నంద్యాల ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, భూమా నాగిరెడ్డి అపస్మారకస్థితిలోకి చేరుకోవడంతో తక్షణం ఎయిర్ ఆంబులెన్స్ ద్వారా హైదరాబాద్‌కు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా, భూమా నాగిరెడ్డి ఆరోగ్యం కుదుట పడాలని ప్రార్థనలు చేయాలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అంతేకాకుండా, భూమా త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. 
 
అదేసమయంలో భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా రెడ్డితో ఫోనులో మాట్లాడిన చంద్రబాబు.. ధైర్యంగా ఉండాలంటూ సలహా ఇచ్చారు. మరోవైపు భూమా నాగిరెడ్డి గుండెపోటుకు గురయ్యారన్న వార్త తెలుసుకున్న ఆయన అనుచరులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. 
 
పార్టీ కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడుతుండగా హఠాత్తుగా ఆయన కుప్పకూలారు. దీంతో అప్రమత్తమైన అనుచరులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అహోబిలంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. తన తండ్రికి గుండెపోటు వార్త వినడంతో ఆమె హుటాహుటీన నంద్యాల బయల్దేరారు. 

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments