Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా అల్లుడు సేవలు భేష్... వాటికి గుర్తింపే ఎమ్మెల్సీ టిక్కెట్ : ఎమ్మెల్యే బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీకి నా అల్లుడు సేవలు అద్భుతంగా ఉన్నాయనీ, ఈ సేవలను గుర్తించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (11:10 IST)
తెలుగుదేశం పార్టీకి నా అల్లుడు సేవలు అద్భుతంగా ఉన్నాయనీ, ఈ సేవలను గుర్తించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. 
 
ఏపీ రాజధాని అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించి అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు తన అల్లుడు నారా లోకేష్‌తో కలిసి బాలకృష్ణ అసెంబ్లీకి వచ్చారు. 
 
ఈ సందర్భంగా బాలకృష్ణ స్పందిస్తూ... పార్టీ కోసం నారా లోకేష్ అహర్నిశలు పాటుపడుతున్నారన్నారు. కార్యకర్తలను, నేతలను సమన్వయపరుస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. అందుకే ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ టిక్కెట్ కేటాయించిందని తెలిపారు. 
 
ఇదిలావుండగా, తన అల్లుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేత, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బాలకృష్ణ దగ్గరుండి నామినేషన్ వేయించారు. సోమవారం శాసనసభ కార్యదర్శి కార్యాలయానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వచ్చిన లోకేష్, తన నామినేషన్ పేపర్లను ఎన్నికల అధికారికి అందించారు. లోకేష్ అభ్యర్థిత్వాన్ని కళా వెంకట్రావు, మంత్రి కేఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు బలపరిచారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments