Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకొడుకు తల్లికి సహకరించాడు.. ఏ విషయంలో తెలుస్తే?

కన్నకొడుకు తల్లికి తోడైయ్యాడు. అదీ కన్నతండ్రిని హతమార్చేందుకు. కన్నతల్లి ప్రియుడిని వదిలి వుండలేకపోవడాన్ని గమనించిన అతడు కన్నతండ్రినే కడతేర్చేందుకు సాయపడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో

Webdunia
ఆదివారం, 17 జూన్ 2018 (10:12 IST)
కన్నకొడుకు తల్లికి తోడైయ్యాడు. అదీ కన్నతండ్రిని హతమార్చేందుకు. కన్నతల్లి ప్రియుడిని వదిలి వుండలేకపోవడాన్ని గమనించిన అతడు కన్నతండ్రినే కడతేర్చేందుకు సాయపడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కల్వకుర్తి పరిధిలోని హనుమాన్ నగర్‌లో కావలి మల్లయ్య (42), పార్వతమ్మ (38) నివాసం వుంటున్నారు. వీరికి 22 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు శ్రీకాంత్ (16), కుమార్తె శ్రీలత (13) ఉన్నారు. 
 
హైదరాబాద్ లో కూలిపని చేసే మల్లయ్య, ప్రతి రెండు వారాలకు ఒకసారి మాత్రమే ఇంటికి వెళుతుండేవాడు. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉన్న మేస్త్రీగా పని చేసే రాముతో పార్వతికి ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధంగా మారింది. మల్లయ్య హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వచ్చేసినా..  రాముతో సంబంధాన్ని పార్వతమ్మ వదులుకోలేకపోయింది. 
 
అందుకే భర్తను చంపేయాలని నిర్ణయించింది. ఇందుకు రాము, శ్రీకాంత్ సహకరించారు. వీరి సహకారంతో ఏప్రిల్ 20వ తేదీన మల్లయ్యను హతమార్చారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ఓ సంచీలో కుక్కి, దానికి సిమెంట్ కడ్డీలు కట్టి, నాగసముద్రం చెరువులో పడవేశారు. 
 
ఆపై చాలా రోజులైనా మల్లయ్య ఇంటికి రాకపోవడంతో అనుమానించిన ఆయన తల్లి బాలమ్మ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆ మరుసటి రోజు తన భర్త కనిపించడం లేదని పార్వతమ్మ కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసులకు పార్వతమ్మపై అనుమానంతో విచారణ జరపడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments